“సర్కారు వారి పాట”లో ఈ స్టైలిష్ విలన్.?

Published on May 30, 2021 10:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై అంతే స్థాయి అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో పలువురు స్టార్ నటులు బాలీవుడ్ నుంచి కూడా ఉండొచ్చన్న టాక్ ముందు నుంచీ ఉంది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో విలన్ రోల్ కోసం లేటెస్ట్ బజ్ ఇంకొకటి వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ ని ధీ కొట్టేందుకు స్టైలిష్ విలన్ అరవింద స్వామిని రంగంలోకి దింపనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే అరవింద స్వామి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో “ధృవ” లో ఎలాంటి పెర్ఫామెన్స్ ఇచ్చారో మనం చూసాము.

మరి మహేష్ తో సినిమా టాక్ నిజం అయితే ఇందులో ఎలా కనిపించనున్నారో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ తో సహా మహేష్ నిర్మాణ సంస్థ కలిపి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :