ఈసారి మ్యాచో మ్యాన్ గోపీచంద్ తో ఈ పక్కా హిట్ కాంబో.!

ఈసారి మ్యాచో మ్యాన్ గోపీచంద్ తో ఈ పక్కా హిట్ కాంబో.!

Published on Jan 7, 2021 9:00 AM IST

gopichand Maruthi

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోలలో అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ ఉన్న అతి తక్కువమంది హీరోలలో యాక్షన్ హీరో గోపీచంద్ కూడా ఒకరు. ఈ మధ్య కాలంలో తాను తీసిన సినిమాలు ఎక్కువగా అండర్ రేటెడ్ గానే నిలవడంతో సామాన్య సినీ ప్రేమికులు గోపీచంద్ లాంటి సాలిడ్ యాక్షన్ పర్సనాలిటీకు ఒక హిట్ తగిలితే చూడాలి అనుకుంటున్నారు.

అయితే ఇప్పుడు గోపీచంద్ పలు ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అనౌన్స్మెంట్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈసారి గోపీచంద్ ఓ సాలిడ్ హిట్ కాంబోతో చేతులు కలిపారు. అదే గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ మరియు దర్శకుడు మారుతి కాంబోలో..వీరి నుంచి ఇప్పటికి వచ్చిన “భలే భలే మగాడివోయ్”, “ప్రతిరోజూ పండగే” చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి.

మరి వీరితో ఇప్పుడు గోపీచంద్ నెక్స్ట్ కన్ఫర్మ్ అయ్యింది. అయితే వీరు తమ ఈ హ్యాట్రిక్ చిత్రాన్ని ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు టైటిల్ ను కూడా త్వరలోనే వదులుతున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. మరి ఈ కాంబో నుంచి ఎలాంటి సినిమా రానుందో చూడాలి.

తాజా వార్తలు