జపాన్ వెళుతున్న యంగ్ ఏజెంట్..!

Published on Aug 2, 2020 7:27 pm IST

గత ఏడాది విడుదలైన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ మంచి విజయాన్ని అనుకుంది. ఓ సీరియస్ ఇన్వెస్టిగేటివ్ సబ్జెక్టు కి హ్యూమర్ జోడించి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక డిటెక్టివ్ గా హీరో నవీన్ పోలిశెట్టి అలరించారు. కాగా ఈ మూవీ జపాన్ లో విడుదల కానుందని సమాచారం అందుతుంది. జపాన్ లో ఇండియన్ మూవీస్ కి భారీగా ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో అక్కడ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సెప్టెంబర్ 11న జపాన్ లో విడుదల కానుంది. నూతన దర్శకుడు స్వరూప్ ఈ చిత్రాన్ని తెరక్కించగా, రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఈ మూవీకి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో తమిళ్, కన్నడ మరియు మలయాళ బాషలలో రీమేక్ కానుంది. మరి ఈ చిత్రం జపాన్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More