ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “ఆచార్య”. ఎప్పటి నుంచో తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం నుంచి టీజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ను మేకర్స్ ఈరోజు విడుదల చెయ్యడానికి రెడీ చేశారు.
మరి ఇదిలా ఉండగా ఈ టీజర్ కొన్ని సర్ప్రైసింగ్ ఎలిమెంట్స్ ను కూడా యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చరణ్ వాయిస్ ఓవర్ అలాగే చరణ్ గ్లింప్స్ షాట్ కూడా ఉంటుంది అని ఖరారు అయ్యింది. మరి ఇప్పుడు వీటితో పాటుగా మరో ఎలిమెంట్ ను కూడా రివీల్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని వేసవి రేస్ లో విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చేసారు.
మరి ఆ అప్పుడు ఎప్పుడు అన్నదే ఈ టీజర్ ద్వారా క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇదే టీజర్ తో అనౌన్స్ చేస్తారా లేదా అన్నది చూడాలి మరి. ఇక ఈ భారీ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


