“వాల్తేరు వీరయ్య” లో అవార్డ్ విన్నింగ్ నటుడు.!

“వాల్తేరు వీరయ్య” లో అవార్డ్ విన్నింగ్ నటుడు.!

Published on Nov 6, 2022 2:00 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు బాబీ తో చేస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుండగా ఇప్పుడు ఈ చిత్రం నుంచి మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అయితే అందించారు. ఈ చిత్రంలో ప్రముఖ వెర్సటైల్ నటుడు బాబీ సింహా అయితే నటిస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు కన్ఫర్మ్ చేసారు.

సోలొమాన్ సీజర్ గా పరిచయం చేస్తూ తనపై ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని అయితే రిలీజ్ చేశారు. మరి తన బర్త్ డే కానుకగా మేకర్స్ అయితే ఈ ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ ని అందించారు. మరి మెగాస్టార్ సినిమాలో ఈ అవార్డ్ విన్నింగ్ నటుడు ఎలాంటి పాత్రలో నటిస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు