డైరెక్షన్ చేస్తానంటున్న టాలెంటెడ్ హీరోయిన్ !

Published on Jun 2, 2021 9:40 am IST

హీరోయిన్ నివేత థామస్ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్. తనలో డైరెక్షన్ స్కిల్ కూడా ఉందని.. భవిష్యత్తులో కచ్చితంగా డైరెక్షన్ చేస్తానని చెబుతోంది ఈ క్రేజీ బ్యూటీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నివేత థామస్ సిస్టర్ క్యారెక్టర్స్ నుండి వాంటెడ్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే గ్యాప్ వచ్చిన సమయంలో డైరెక్షన్ కోర్సు కూడా చేసిందట.

అందుకే, భవిష్యత్తులో ఎలాగైనా దర్శకత్వం వహిస్తానని, అయితే ఇంకా తానూ మంచి పాత్రలు చేయాలని, నటిగా కొన్నేళ్ల ప్రయాణం తరువాత, డైరెక్టర్ గా మారతాను అని, నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని అంటుంది నివేత. కానీ వెంటనే మూవీ డైరక్షన్ కోసం ప్రయత్నాలు చేయాలని లేదట, ముందుగా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి దర్శకురాలిగా మారాలి అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. మరి చూడాలి డైరెక్టర్ గా సక్సెస్ అవుతుందో లేదో.

సంబంధిత సమాచారం :