“సర్కారు వారు పాట”కి ఈ టాక్ నిజమే.?

Published on Feb 24, 2021 10:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రంపై కాస్త స్పెషల్ అంచనాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ మాస్ సినిమాకు గాను థమన్ వీరి కాంబోపై ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఒక మాస్ సాంగ్ ను కూడా రెడీ చేసారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా గత కొన్నాళ్ల కితమే ఈ సినిమాలో ఓ సాంగ్ కు గాను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేస్తున్నారని టాక్ వచ్చింది.

వీరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన “సరిలేరు నీకెవ్వరు” నుంచి మైండ్ బ్లాక్ సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇందులో కూడా ఓ సాంగ్ చెయ్యనున్నారని ఆయా మధ్య టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు అది నిజమే అన్నట్టు తెలుస్తుంది. మరి ఈసారి ఏ రేంజ్ దుమ్ము లేపుతారో చూడాలి.

సంబంధిత సమాచారం :