శంకర్, చరణ్ ల ప్రాజెక్ట్ పై లైవ్ లోనే ఈ టాక్.?

Published on Jul 15, 2021 7:06 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” చిత్రం తర్వాత మరో పాన్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ శంకర్ తో సాలిడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి చాలా కాలం అనంతరం ఈ సినిమాకి కూడా లైన్ క్లియర్ కావడంతో శంకర్ మొత్తం దృష్టి ఈ ప్రాజెక్ట్ పై పెట్టారు. దీనితో ఎట్టకేలకు ఈ చిత్రం షూట్ కి కూడా రంగం సిద్ధం అవుతుంది.

అయితే ఈ సినిమా అనౌన్స్ అయ్యిన నాటి నుంచి చాలా ఆసక్తికర వార్తలే వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నదానిపై ఇంకా సస్పెన్స్ నడుస్తుంది అంటే అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా ఎవరు నటిస్తున్నారు అన్నదానికి చాలా మంది స్టార్ హీరోయిన్స్ పేర్లే వినిపించినా కియారా అద్వానీ ఫిక్స్ అయ్యింది అని తెలిసింది.

కానీ ఇప్పుడు “RRR” లో చరణ్ సరసన నటిస్తున్న ఆలియా భట్ పేరు కూడా ఆ మధ్య బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈమెనే ఫైనల్ అయ్యింది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే ఇద్దరి హీరోయిన్స్ విషయంలో కూడా ఇంకా ఎలాంటి అధికారిక మూమెంట్ లేదు. మరి ఈ కన్ఫ్యూజన్ కి శంకర్ ఎప్పుడు తెర దించుతారో చూడాలి.

సంబంధిత సమాచారం :