ఈసారి “బిగ్ బాస్” ఎలిమినేషన్ మరింత రసవత్తరంగా!

Published on Oct 27, 2020 2:01 pm IST

లేటెస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరియు అక్కినేని కోడలు సమంతా అక్కినేని బిగ్ బాస్ హోస్ట్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. నాగ్ సినిమా షూట్ లో బిజీగా ఉండడంతో ఈ ఈసారి వీకెండ్ కు సమంతా హోస్ట్ గా కనిపించి అందరినీ మెప్పించేలా హోస్ట్ చేసింది.

అయితే ఇప్పుడు మంచి రసవత్తరంగా సాగుతున్న ఈ గ్రాండ్ రియాలిటీ గేమ్ షోలో ఇంతకు మునుపు లేని విధమైన నామినేషన్స్ తో ఎలిమినేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ఉందని బిగ్ బాస్ వీక్షకుల్లో టాక్ నడుస్తుంది.

ఇన్ని రోజులు ఒకరితో ఒకరు బాగా క్లోజ్ ఉన్నవారు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో ఈసారి ఎలిమినేషన్ ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

అఖిల్ మరియు అమ్మ రాజశేఖర్ ల మధ్య హీటెక్కించిన గొడవ అలాగే అభిజీత్ మోనాల్ ను నామినేట్ చెయ్యడం ఊహించని కామెంట్స్ చెయ్యడం కూడా షాక్ కు గురి చేసింది.

ఇక అరియనా మరియు మెహబూబ్ ల విషయానికి వస్తే ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవడం వంటివి కూడా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్ళిపోతారు అన్నది మొత్తం బిగ్ బాస్ వీక్షకుల్లో ఆసక్తిగారంగా మారింది.

సంబంధిత సమాచారం :

More