ఈసారి హృతిక్ కి ఎదురులేదు…!

Published on Jul 12, 2019 8:30 am IST

గణిత శాస్త్ర మేధావి ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన “సూపర్ 30” నేడు ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాడంగా విడుదలైంది. మధ్యతరగతి వర్గానికి చెందిన మ్యాథ్స్ టీచర్ ఆనంద్ కుమార్ పేదలైన అతిసామాన్య విద్యార్థులను తన ప్రతిభతో ఎలా తీర్చిదిద్దాడు అనే కథాంశంతో తెరకెక్కుతుంది. ఏ మూవీ కోసం హృతిక్ డి గ్లామర్ పాత్రలో అద్భుతంగా నటించారు.

ఐతే హృతిక్ మూవీ సూపర్ 30 బాలీవుడ్ లో సోలో గా విడుదల అవుతుంది. ఈ వారం బాలీవుడ్ లో మరో ఏ హిందీ చిత్రం విడుదల కాకపోవడంతో కేవలం సూపర్ 30 ఒక్కటే సందడి చేయనుంది. హృతిక్ మూవీకి వసూళ్ల పరంగా కూడా ఇది బాగా కలిసొచ్చే అంశమే.హృతిక్ తన స్థాయి హిట్ అందుకొని చాలా రోజులవుతుంది. మరి సర్వత్రా పాజిటివ్ ఒపీనియన్స్ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సూపర్ 30 పెద్ద విజయం సాధించే అవకాశాలు బాగా ఉన్నాయి.

వికాస్ బహెల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్స్,నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్,ఫాంటమ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More