ఫైట్స్ తో కూడా మెప్పిస్తానంటున్న మిల్క్ బ్యూటీ

Tamanna
కాలేజీకి వెళ్ళాల్సిన రోజుల్లోనే ఫేస్ కి మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చిన హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా. కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న తమన్నా తెలుగు, తమిళ భాషల్లో ఎంతో మంది స్టార్ హీరోస్ తో సినిమాలు చేసి వరుస విజయాలను అందుకొని టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తమన్నా చేసిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి’. ఈ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఈ సినిమా అనుభవాలను పంచుకుంటున్న తమన్నా ‘నా కెరీర్లో వచ్చిన పాత్రలని ఓ పరీక్షలా తీసుకొని చేసాను. అలా రీసెంట్ గా రాసిన టఫ్ ఎగ్జామ్ బాహుబలి. ఇప్పటి వరకూ అందరికీ నా నటన గురించి, దాస్నుల గురించి తెలుసు, కానీ కెరీర్లో మొదటి సారి ఫైట్స్ చేసాను. కచ్చితంగా నా ఫైట్స్ కూడా అందరినీ మెప్పిస్తాయని అనుకుంటున్నాను. బాహుబలి రిజల్ట్స్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని’ తెలిపింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్.

Exit mobile version