ఈసారి “కేజీయఫ్ 2” నుంచి ఈ భారీ అప్డేట్ లేనట్టే.?

Published on Jan 6, 2022 1:02 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 1” ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ఇక ఈ సినిమా ఎండింగ్ తో ఈ భారీ సినిమాకి సీక్వెల్ కోసం మాత్రం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ భారీ సినిమా ఆల్రెడీ ఈ వచ్చే ఏప్రిల్ నెలకి షిఫ్ట్ చెయ్యగా మేకర్స్ ఇప్పటి వరకు అలానే ప్లాన్ చేసుకున్నారు కానీ మళ్ళీ కరోనా తీవ్రత పెరిగిపోతుండడంతో సినిమా రిలీజ్ పట్ల ఇప్పుడు ఆసక్తి నెలకొంది. కానీ ఇప్పుడు దానికన్నా ముందు ఓ బిగ్ అప్డేట్ ఏమన్నా రివీల్ చేస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు.

ఈ జనవరి 8న హీరో యష్ బర్త్ డే కానుకగా ఏదన్నా బ్లాస్టింగ్ అప్డేట్ ఉంటుందా అని చూస్తుండగా దానికి మాత్రం ఈసారి డిజప్పాయింట్మెంట్ తప్పదని తెలుస్తుంది. లాస్ట్ టైం అయితే గ్లింప్స్ ని రిలీజ్ చెయ్యగా ఏ స్థాయి రెస్పాన్స్ వచ్చిందో చూసాం. కానీ ఈసారి మాత్రం అలాంటి మేజర్ అప్డేట్స్ ఉండవనే తెలుస్తుంది. మరి చూడాలి ఈ గ్యాప్ లో ఏమన్నా రివీల్ చేస్తారో లేదో అనేది.

సంబంధిత సమాచారం :