ఈసారి తానే అప్డేట్ ఇచ్చిన తారక్.!

Published on May 14, 2021 12:04 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే కోవిడ్ బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. దానితో అభిమానులు సహా ఇతర సినీ తారలు కూడా తారక్ ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు. అలాగే ఇదే అనుకుంటే స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా తారక్ యోగ క్షేమాలను కనుక్కోవడం ఇరువురి అభిమానులకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది.

అయితే అప్పుడు మెగాస్టార్ ద్వారా తారక్ ఆరోగ్యం అప్డేట్ తెలియగ ఇప్పుదు స్వయంగా తారక్ నే తన ఆరోగ్యం కోసం తెలిపారు. ఈ “ఈద్” శుభాకాంక్షలు తెలియజేస్తూ తనకోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే ప్రస్తుతం బెటర్ గా ఫీల్ అవుతున్నాని త్వరలోనే కరోనా నెగిటివ్ కూడా కావచ్చని మరో పాజిటివ్ న్యూస్ ఇచ్చాడు.

అలాగే ప్రతి ఒక్కరూ సేఫ్ గా ఉంది వహించాలని తారక్ సూచించారు. ప్రస్తుతం తారక్ దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :