మరి ఈసారి “పుష్ప” రాజ్ కు విలన్ ఎవరో..?

Published on May 16, 2021 5:03 pm IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. పాన్ ఇండియన్ లెవెల్లో హైప్ సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా సుకుమార్ క్యాస్టింగ్ పరంగా కూడా సాలిడ్ ప్లానింగ్స్ చేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో ఈ చిత్రంలో విలన్ రోల్ పై మంచి టాక్ ఉంది. ఎట్టకేలకు ఆ సాలిడ్ పాత్రలో మళయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారని కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఫహద్ రోల్ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ వస్తుందని తెలిసింది.

అలాంటప్పుడు ఇందులో బన్నీ తలపడే మరో విలన్ ఎవరు అన్న చర్చ స్టార్ట్ అయ్యింది. తాను ఎలాగో ఎర్ర చందనం దుంగల స్మగ్లర్ కాబట్టి చట్టంతోనే మెయిన్ ఫైట్ ఉంటుందా లేక మరో సాలిడ్ విలన్ ఉంటాడా అన్నది చూడాలి. ఇక ఈ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :