మహేష్ లిస్ట్ లో ఈ టాప్ దర్శకుడు కూడానా?

మహేష్ లిస్ట్ లో ఈ టాప్ దర్శకుడు కూడానా?

Published on Dec 1, 2020 8:00 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వరుస విజయ చిత్రాల దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం షూట్ త్వరలోనే మొదలు కానుంది. ఇక అలాగే మరోపక్క మహేష్ ఈ చిత్రం తర్వాత చేయనున్న సినిమా ఏంటి అని ఎవరితో అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

అయితే ఇప్పటికే ఈ రేస్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఖరారు అయ్యిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మహేష్ కు తన లాస్ట్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చిన అనీల్ రావిపూడి కూడా లైన్ లోకి వచ్చారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ హిట్ దర్శకునితో పాటు మహేష్ లస్ట్ లో మరో టాప్ దర్శకుడు చేరినట్టుగా బజ్ వినిపిస్తుంది.

ఆ దర్శకుడు మరెవరో కాదు మన టాలీవుడ్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్. ఇప్పుడు ఈ దర్శక, హీరోల నడుమ సంప్రదింపులు నడుస్తున్నట్టుగా టాక్. “1 నేనొక్కడినే” తర్వాత ఆ కాంబో సెట్టవ్వలని మహేష్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మరి మళ్ళీ ఈ కాంబో ఎప్పుడు రిపీట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు