మెగాపవర్ స్టార్ లైనప్ లో ఈ దర్శకుని పేరు కూడా.?

Published on Apr 21, 2021 3:00 pm IST

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో దర్శక ధీరుడు రాజమౌళితో భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే దీని తర్వాత సెన్సేషనల్ దర్సకుడి శంకర్ తో సినిమా కూడా ఉంది. ఇక ఈ చిత్రం అనంతరం టాలెంటెడ్ యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పేరు కూడా వినిపించింది కానీ ఇంకా దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ఇప్ప్పుడు చరణ్ లైనప్ లో మరో టాలీవుడ్ టాప్ దర్శకుని పేరు కూడా ఉందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు ఇదివరకే చరణ్ కు “రంగస్థలం” లాంటి భారీ హిట్ ఇచ్చిన ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ నే.. ఇప్పుడు చరణ్ లైనప్ లో ఈ దర్శకుని పేరు కూడా ఉన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :