తారక్ షోలో ప్రతి ఎపిసోడ్ కి కూడా ఈ టచ్ ఉండనుందా.?

Published on Aug 7, 2021 1:41 pm IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళితో “RRR” అనే భారీ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఇది ఎలాగో ముగుస్తుండగా మళ్ళీ చాలా కాలం అనంతరం స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో ఒకటైన “ఎవరు మీలో కోటీశ్వరులు” కి హోస్ట్ గా తారక్ కనిపించేందుకు సిద్ధం అవుతున్నాడు.

మరి ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేసిన తారక్ ఇప్పుడు సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ గేమ్ షో నుంచి ఒక్కొక్కటిగా వస్తున్న ప్రతీ ఎపిసోడ్ ని చూస్తే ఓ పక్క గేమ్ తో పాటుగా మరోపక్క ప్రతీ ఎపిసోడ్ లో కూడా స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ ని కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు అర్ధం అవుతుంది.

లేటెస్ట్ ప్రోమో కూడా అంతే ఎమోషనల్ గా అనిపిస్తుంది. దీనితో ఈ షో లో ప్రతీ ఎపిసోడ్ కి కూడా కొన్ని ఆదర్శ లక్ష్యాలు ఉన్న కంటెస్టెంట్స్ నే కనిపించనున్నారని చెప్పాలి. మరి ఈ నెలలోనే మొదటి ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయనున్న ఈ షో డేట్ ఎప్పుడో రివీల్ కావాల్సి ఉంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :