మళ్ళీ పవన్ రెండు సాలిడ్ ప్రాజెక్ట్స్ ఒకేసారి.!

Published on May 30, 2021 10:06 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” ఈ ఏడాది విడుదలై భారీ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా లైన్ లో ఉండగానే పవన్ చేపట్టిన మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వకీల్ సాబ్ కాకుండా మళయాళ సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా లైన్ లో ఉంది.

అలాగే దీనితో పాటుగా విలక్షణ దర్శకుడు క్రిష్ తో ప్లాన్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు” చాలా మేర షూట్ జరుపుకుంది. అయితే కొన్నాళ్ల కితం మూడు సినిమాల్లో కూడా ఏకకాలంలో నటించిన పవన్ కోవిడ్ బారిన పడ్డాక వాటన్నిటికీ బ్రేక్ ఇచ్చేసారు. మరి ఇప్పుడు పవన్ మళ్ళీ సన్నద్ధం అయ్యినట్టు తెలుస్తుంది.

అలాగే వీరమల్లు సహా అయ్యప్పణం రీమేక్ రెండు చిత్రాల్లో కూడా ఒకే సారి షూట్ లో పాల్గొననున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ చిత్రాలు ఎప్పటికి పూర్తి అవుతాయో చూడాలి. ఇక ఓ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా మరో చిత్రంలో నిత్య మీనన్ నటిస్తుంది అని టాక్ ఉంది.

సంబంధిత సమాచారం :