పవన్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన వైరల్ అయిన నటి.!

Published on Jun 12, 2021 8:04 am IST

గత కొన్ని రోజులు నుంచి టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది హిస్టోరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ కాంబో హరీష్ శంకర్ తో ఫిల్మ్ నిలిచింది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి నిన్న టైటిల్ వరకు కూడా ఓ రేంజ్ లో గాసిప్స్ వైరల్ కాగా వాటిపై దర్శకుడు సహా మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ చిత్రం స్టార్టింగ్ లోనే ఓ టాక్ మరో స్థాయిలో వైరల్ అయ్యింది.

ఈ చిత్రంలో పవన్ సరసన యంగ్ అండ్ బ్యూటిఫుల్ మళయాళ నటి మానస రాధాకృష్ణన్ నటిస్తుంది అన్న టాక్ ఓ రేంజ్ లో వైరల్ కాగా అపుడు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇపుడు ఈ విషయం పైనే తాను స్పందిస్తూ మానస క్లారిటీ ఇచ్చింది. “తాను పవన్ చేస్తున్న 28వ సినిమాలో లేనని తెలియజేస్తున్నాని, కానీ నాకు పవన్ సర్ అంటే ఇష్టం అని” క్లారిటీ ఇచ్చింది. దీనితో ఈ క్లారిటీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :