పవన్ అస్వస్థతకు అది కూడ ఓ కారణమా.?

Published on Apr 17, 2021 10:11 am IST

నిన్ననే ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరోగ్యంకు సంబంధించి వచ్చిన రెండు వార్తలు ఆశ్చర్యం కలిగించాయి. ఉదయమే పవన్ కు కరోనా నెగిటివ్ వచ్చింది అని ఊపిరి పీల్చుకునే లోపే తన పార్టీ జనసేన సోషల్ మీడియా నుంచి పవన్ కోవిడ్ పాజిటివ్ వచ్చింది అన్న వార్త ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది.

దీనితో టాలీవుడ్ మొత్తం పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోపక్క పవన్ అభిమానులు కూడా కాస్త బాధలోనే ఉన్నారు. అయితే పవన్ కు కరోనా ఈ టైం లో వస్తుంది అని ఎవరూ అనుకోని ఉండరు. కానీ పవన్ కు కోవిడ్ రావడానికి ఉన్న చాలానే కారణాల్లో తన పొలిటికల్ యాత్ర కూడా ఒకటి అన్నట్టు తెలుస్తుంది.

ఆ సమయంలో పవన్ కు ఎండ దెబ్బ తగలడం మూలాన అప్పటికే పవన్ బాగా అలసిపోయారని దానికి తోడు కరోనా తాకడంతో ఇప్పుడు పాజిటివ్ వచ్చారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్ తంగెళ్ల సుమన్ తో పాటుగా అపోలో నుంచి వచ్చిన స్పెషల్ టీం పవన్ ఆరోగ్యంను చూసుకుంటున్నారట. ప్రస్తుతం పవన్ హెల్త్ కుదుటగానే ఉందని వైద్యులు తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం :