“రాధే శ్యామ్” రిలీజ్ పై క్లారిటీ ఇదే అనుకోవచ్చా.?

Published on Jun 9, 2021 11:00 am IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియన్ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం విడుదల పై గత్ ఆఁకొన్నళ్ళ నుంచి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారీ ఓటిటి డీల్స్ ఈ చిత్రానికి వస్తుండగా ఈ చిత్రం డైరెక్ట్ రిలీజ్ అంటూ రచ్చ స్టార్ట్ అయ్యింది.

కానీ ఈ చిత్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని థియేట్రికల్ రిలీజ్ మాత్రమే అవుతుందని మరోసారి క్లారిటీ వినిపిస్తుంది. కాస్త లేట్ అయినా కూడా ఈ చిత్రం థియేటర్స్ లోనే వస్తుంది అని ఆ మధ్య టాక్ వచ్చింది. కానీ బాలీవుడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఈ చిత్రం దసరా రేస్ కి ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది.. మరి దీనితో ఈ చిత్రం కేవలం థియేట్రికల్ రిలీజ్ ఫస్ట్ అని అర్ధం అవుతుంది. సో ఆ అధికారిక క్లారిటీ వచ్చే వరకు ఎదురు చూడక తప్పదు.

సంబంధిత సమాచారం :