లేటెస్ట్..”కేజీయఫ్ 2″ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా.?

Published on May 15, 2021 1:35 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంపై ఎనలేని అంచనాలు ప్రతీ భాషలోనూ నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం నుంచి ఆల్రెడీ జూలై నెలలో విడుదల అని డేట్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కానీ ఊహించని విధంగా కోవిడ్ సెకండ్ వేవ్ పెరగడంతో విడుదల వాయిదా పడేలా ఉందని గత కొంత కాలం నుంచి టాక్ ఉంది. అలాగే ఇదే విడుదల జూలై నుంచి అక్టోబర్ కి షిఫ్ట్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఆ అక్టోబర్ లో ఏ డేట్ న ఈ చిత్రం వస్తుందా అన్నది ఇప్పుడు తెలుస్తుంది.

ఇది వరకు మరో భారీ చిత్రం “RRR” విడుదల తేదీ అక్టోబర్ 13 అని టాక్ వచ్చింది కానీ ఇప్పుడు 15న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ తేదీ అయినా ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :