“వకీల్ సాబ్” స్ట్రీమింగ్ డేట్ అప్పుడు కాదు..మరి ఎప్పుడంటే?

Published on Apr 23, 2021 1:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రం ఆల్ మోస్ట్ ఫుల్ రన్ కు వచ్చేస్తుంది. అలాగే మరోపక్క మళ్ళీ కోవిడ్ పెరుగుతుండడంతో ఆల్రెడీ థియేటర్స్ లోకి వచ్చిన పలు చిత్రాలు ఓటిటిలోకి కూడా వచ్చేస్తున్నాయి.

మరి ఈ క్రమంలో ఇప్పుడు వకీల్ సాబ్ చిత్రం ఎప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వస్తుందా అని చూస్తున్నారు. అయితే ఈ టైం లోనే ఈ చిత్రం వచ్చే మే 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వస్తుంది అని టాక్ మొదలయ్యింది. కానీ ఇది నిజం కాదని తెలుస్తుంది. ఓటిటి నిపుణులు ఏం చెపుతున్నారంటే ఈ చిత్రం వచ్చే మే చివరి వారంలో స్ట్రీమింగ్ కు వస్తుంది అని చెప్తున్నారు.

సో మే 7న అన్నది అవాస్తవం అనే చెప్పాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా అనన్య నాగళ్ళ, నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరో పవర్ ఫుల్ రోల్ లో నటించారు. అలాగే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :