“ఆదిపురుష్” కోసం ప్రభాస్ తమ్ముడు అలా ప్రిపేర్ అవుతున్నాడట.!

Published on Apr 8, 2021 8:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న మహత్తర ప్రాజెక్ట్స్ లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. మరి అలాగే ఈ చిత్రం నెవర్ బిఫోర్ గా ఉంటుందని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. అలా క్యాస్టింగ్ ను లాక్ చేసేసిన టీం ఇందులో రాముని పాత్రలో ప్రభాస్ చేస్తుండగా లక్ష్మణ పాత్రలో బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సన్నీ సింగ్ చేస్తున్నాడు.

అయితే ఇదిలా ఉండగా సన్నీ మాత్రం చాలా శ్రద్ధతో తన లక్ష్మణ పాత్రకు సన్నద్ధం అవుతున్నాడట. అందుకోసమే పవిత్ర రామాయణాన్ని వీక్షిస్తూ లక్ష్మణ పాత్రకు సంబంధించిన మెళుకువలు నేర్చుకుంటున్నాడని తెలుస్తుంది. ఆ హావభావాలు నడవడిక అంతా నేర్చుకుంటున్నాని తెలిపాడు.

ఇక ఈ చిత్రంలో సీత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తుండగా రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఇండియాలోనే బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది ఆగష్టు 11న విడుదల చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :