నాగబాబుకి తెలిసిన ఆర్ఆర్ఆర్ కథ ఇదేనట

నాగబాబుకి తెలిసిన ఆర్ఆర్ఆర్ కథ ఇదేనట

Published on Apr 13, 2020 9:05 PM IST

Naga babu1

ఆర్ ఆర్ ఆర్ కథ ఏమిటీ అనేది ఎవరికీ అంతుబట్టని విషయం. చారిత్రక వీరులైన కొమరం భీమ్, సీతారామ రాజుల పాత్రలతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. వారిద్దరి నేపధ్యాలు అందరికీ తెలిసిన తరుణంలో ఫిక్షన్ స్టోరీ కావడంతో ఓ క్లారిటీ అనేది రావడం లేదు. ఇక చరణ్ ఇంట్రో వీడియో తరువాత అసలు అంతు తెలియకుండా పోయింది. కాగా చరణ్ బాబాయ్ నాగబాబు ని ఆర్ ఆర్ ఆర్ కథ గురించి అడుగగా ఆయనకు తెలిసింది చెప్పారు.

ఆయన ప్రకారం కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు లు ఒకరు తెలంగాణా, ఒకరు ఆంధ్రా ప్రాంతంలో పేదల హక్కుల కోసం పోరాడిన వీరులు. చరిత్రలో వీరు కలవలేదు, ఒకవేళ కలిసి యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అనేదే ఆర్ ఆర్ ఆర్ కథ అని తెలుస్తుంది అన్నారు. కథ ఏదైనా గాని భారీ విజయం మాత్రం ఖాయం అని ఆయన అన్నారు.

తాజా వార్తలు