చరణ్, శంకర్ ల భారీ ప్రాజెక్ట్ అప్పుడు మొదలు కానుందా.?

Published on Jul 4, 2021 4:35 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్స్ లో మరో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ శంకర్ తో ప్లాన్ చేసింది. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ కాంబో జస్ట్ అనౌన్సమెంట్స్ తోనే సెన్సేషన్ ను నమోదు చేసింది. అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మాత్రం చాలానే సమయం తీసుకుంది.

దానికి కారణం శంకర్ ఈ సినిమాకి ముందు టేకప్ చేసిన భారీ పాన్ ఇండియన్ సినిమా “ఇండియన్ 2”. ఈ సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారికి మరియు శంకర్ కి కొన్నాళ్లుగా కోర్టులో వాగ్వాదాలు నడుస్తున్నాయి. కానీ మొన్నటితో శంకర్ కి ఫేవర్ తీర్పు రావడంతో ఈ సినిమాకు లైన్ క్లియర్ అయ్యిపోయింది.

మరి ఈ సినిమా షూట్ ఎప్పుడు నుంచి స్టార్ట్ కానుంది అన్న దానిపై టాక్ కూడా ఇప్పుడు బయటకి వచ్చింది. మరి దాని ప్రకారం ఈ చిత్రం వచ్చే సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కానుందట. అసలే ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే మిగతా మూవీ లవర్స్ కూడా శంకర్ స్ట్రాంగ్ కం బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :