‘హరిహర వీరమల్లు’పై బిగ్ అప్డేట్ ఆరోజున ప్రెస్ మీట్ తో ఫిక్స్!?

Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ అలాగే జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కి ఫైనల్ గా సమయం దగ్గరకి వస్తుండగా ఈ రిలీజ్ డేట్ పై క్లారిటీ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. మరి ఈ డేట్ ఈ జూన్ 12కి ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ డేట్ ని మేకర్స్ ఈ సోమవారం ప్రెస్ మీట్ పెట్టి గ్రాండ్ గా అనౌన్స్ చేయనున్నారట. మొత్తానికి మాత్రం హరిహర వీరమల్లు నుంచి నెక్స్ట్ నెల వరకు మొత్తం నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో బాబీ డియోల్ తదితరులు నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version