చరణ్ భారీ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేది అప్పుడేనా.?

Published on May 29, 2021 8:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళితో భారీ పీరియాడిక్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ భారీ చిత్రం అనంతరం మరో పాన్ ఇండియన్ దర్శకుడు తో ఓ సినిమా కమిట్ కాగా దానిపై అంచనాలు నమోదు అయ్యాయి. అయితే ఈ కాంబోలో సినిమా అసలు ఎప్పుడు మొదలు కానుంది అన్న అంశంపై ఎప్పటి నుంచో మంచి ఆసక్తి నెలకొంది.

మరి ఈ సెన్సేషనల్ కాంబో అన్నీ అనుకూలంగా జరిగితే ఏ డేట్ తర్వాత నుంచి స్టార్ట్ కానుందో టాక్ వినిపిస్తుంది. శంకర్ కు కనుక ప్రస్తుతం నడుస్తున్న వివాదాల నుంచి ఉపశమనం కలిగితే వచ్చే జూన్ 4 లేదా 5 తర్వాత ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుందో క్లారిటీ ఇవ్వనున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. మరి దీనిపై ఎలాంటి క్లారిటీ రానుందో చూడాలి. ఇక శంకర్ మరియు చరణ్ ల కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రాన్ని దిల్ రాజు తన బ్యానర్ 50 వ సినిమాగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :