ఆ నిమిషం మహేష్ ని వదిలి ఉండలేనని తెలిసింది.

Published on Jul 1, 2020 7:37 am IST

టాలీవుడ్ లో మహేష్ – నమత్రల బంధం చూసి ఎవరైనా కుళ్ళుకోవలసిందే. వీరి అన్యోన్య దాంపత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. 15ఏళ్ళ వివాహ బంధంలో ప్రతినిమిషం ఆస్వాదిస్తున్నారు. మరి ఈ లవ్లి కపుల్ బంధానికి నాంది ఎక్కడ పడిందంటే…న్యూజిలాండ్ లో అట. వంశీ చిత్రం కోసం 52 రోజుల లాంగ్ షెడ్యూల్ న్యూజిలాండ్ లో చిత్రీకరించగా… షూటింగ్ ముగిసిన చివరి రోజు మహేష్ ని విడిచి ఉండలేననే భావన నమ్రతలో కలిగిందట.

అదే ఫీలింగ్ మహేష్ లో కూడా చోటు చేసుకోగా.. ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన నమత్ర పిల్ల సంరక్షణ, మహేష్ సినిమాలు మరియు బిజినెస్ విషయాలు చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు తన అభిమానులతో అందుబాటులో ఉండే నమత్రకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఇక మహేష్ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More