“సర్కారు వారి బ్లాస్టర్” అనే ఎందుకు అంటున్నారో క్లారిటీ!

Published on Aug 5, 2021 9:00 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట” పైనే హవా నడుస్తుంది. వచ్చే ఆగష్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి అదిరే అప్డేట్ సిద్ధంగా ఉందని చెబుతున్నారు. మరి మొదటి నుంచి కూడా ఆ అప్డేట్ ని బ్లాస్టర్ అంటూ ప్రమోట్ చేస్తుండగా దానిని ఏ టీజర్ అనో లేక గ్లింప్స్ అనో ఎందుకు చెప్పట్లేదు అన్నది ఇప్పుడు క్లారిటీ తెలుస్తుంది.

మరి చిత్ర యూనిట్ చెబుతున్న దాని ప్రకారం ఈ సర్కారు వారి బ్లాస్టర్ అనేది టీజర్, గ్లింప్స్ ల కంటే కూడా ఎంతో హై లెవెల్లో ఇస్తుంది అని అందుకే అలా ప్రమోట్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మరి ఇప్పటికే ఆ ఏమిటి అన్నది సినీ వర్గాల్లో చాలా ఆసక్తి నెలకొంది. మరి దర్శకుడు పరశురామ్ పెట్ల ఏం ప్లాన్ చేసారో ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :