“పుష్ప” ప్రాజెక్ట్ కి ఫహద్ అందుకే ఓకే చెప్పాడట.!

“పుష్ప” ప్రాజెక్ట్ కి ఫహద్ అందుకే ఓకే చెప్పాడట.!

Published on Aug 29, 2021 1:30 PM IST

Pushapa
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రంలో మరో విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ స్ట్రాంగ్ విలన్ రోల్ లో నటిస్తున్నట్టుగా చెప్పి నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది.

అయితే అసలు ఈ చిత్రంలో ఫహద్ ఎంపికతోనే చాలా హైప్ వచ్చింది. అయితే మరి ఫహద్ ఈ చిత్రం తోనే ఎందుడు టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు అన్న దానికి సమాధానం దొరికింది. ఇంతకు ముందు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించిన ఫహద్ పుష్ప తో స్ట్రైట్ ఎంట్రీ ఇస్తుండడం ఆనందంగా ఉందని రీసెంట్ ఇంటర్వ్యూ లో తెలిపాడు.

తనకి సుకుమార్ పుష్ప లో తన రోల్ కోసం చెప్పినట్టు చాలా ఎగ్జైట్ అయ్యాడట పైగా ఈ రోల్ తన కెరీర్ లోనే ఎప్పుడూ చెయ్యండి కావడం ఇలాంటి రోల్ తోనే టాలీవుడ్ లోకి ఎంటర్ అయితే బాగుంటుంది అని భావించి పుష్ప ప్రాజెక్ట్ కి ఫహద్ ఓకే చెప్పాడట.

తాజా వార్తలు