ఆగని “చరణ్ 15” లీక్స్..అసలు కారణం ఇదే కావచ్చు.!

Published on Feb 16, 2023 7:05 am IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం చరణ్ మరియు శంకర్ ల కెరీర్ లో 15వ సినిమానే కావడంతో దీనిపై మరింత హైప్ నెలకొంది. ఇక ఇదిలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ ని శంకర్ ఫుల్ స్వింగ్ లో అయితే చేస్తున్నారు. కానీ మరో పక్క మొదటి నుంచి కూడా చాలా ఎక్కువ మొత్తంలో లీక్స్ వచ్చేస్తున్నాయి.

అయితే మొదట్లో శంకర్ కట్టు దిట్టంగానే చూసుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం పెద్ద మొత్తంలో లీక్స్ ఆగడం లేదు. అయితే జెనరల్ గా శంకర్ సినిమాల నుంచి సినిమా కథ నుంచి ప్రతి అంశం కూడా కేవలం సెట్స్ వరకు మాత్రమే పరిమితం సినిమాకి పని చేసే ఏ టెక్నీషియన్ గాని లేదా నటులు కానీ ఎక్కడా సినిమా కోసం రివీల్ చేయరు. అలాంటిది ఈ సినిమాకి షూటింగ్ స్పాట్ నుంచి బాగా ఫోటోలు కానీ వీడియో లు కానీ బయటకి వస్తున్నాయి.

మరి దీనికి ప్రధాన కారణం అయితే సినిమా షూటింగ్ అధిక శాతం అవుట్ డోర్ లో జరుగుతూ ఉండడమే అని చెప్పొచ్చు. దాదాపు సినిమా లొకేషన్స్ అన్నీ జన సాంద్రత ఉన్న ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది దీనితో అందులోని ఇప్పుడు ఉన్న టైం లో అందరి చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉండడంతో కొంచెం దూరం నుంచి అయినా ఫోటోలు వీడియో లు తీసేస్తున్నారు. దీనితో ఈ కారణం చేతనే ఇంత స్థాయిలో లీక్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. వీటితో మాత్రం ఇతర కొంతమంది ఫ్యాన్స్ బాధ పడుతున్నారు.

సంబంధిత సమాచారం :