“వకీల్ సాబ్”కి వేణుని అందుకే తీసుకున్నా – దిల్ రాజు

Published on Apr 8, 2021 12:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. భారీ అంచనాలతో రేపే విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఇదిలా ఉండగా ప్రమోషన్స్ ను మేకర్స్ ఓ రేంజ్ లో చేస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాము. అలా ఈ చిత్రం నిర్మాత దిల్ రాజు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో పలు ఇంట్రెస్టింగ్ విషయాలనే వెల్లడించారు. అయితే మామూలుగానే దిల్ రాజు పవన్ కు పెద్ద ఫ్యాన్ మరియు ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలని ఓ డ్రీం ఉన్న సంగతి తెలిసిందే.

అలా ఈ ప్రాజెక్ట్ తో ఎలా చెయ్యాల్సి వచ్చిందో మాట్లాడుతూ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ ప్రాజెక్ట్ తన దగ్గరకి తీసుకొచ్చినపుడు కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది అన్న ఆలోచనతోనే అప్రోచ్ కాగా పవన్ వెంటనే ఓకే చెప్పడం జరిగాయని చెప్పారు. కాకపోతే చాల త్వరగా ఫినిష్ చెయ్యాలని చూసిన ప్రాజెక్ట్ కాస్తా కరోనా వల్ల ఇంత లేట్ అయ్యిందని అన్నారు.

మరి అలాగే ఈ సినిమాకు వేణు శ్రీరామ్ నే దర్శకుడిగా ఎంచుకోడానికి కారణం కూడా చెప్పారు. మొదట ఈ సబ్జెక్టును ఎవరు హ్యాండిల్ చెయ్యగలరు అన్నపుడు ఓ ముగ్గురు నలుగురు పేర్లు వినిపించాయట. కానీ వేణు అయితే ఎలాగూ పవన్ ఫ్యాన్ మంచి దర్శకుడు కావడంతో ఈ సినిమాను ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లగలడు అన్న నమ్మకంతోనే వేణు శ్రీరామ్ ను ఎంచుకున్నట్టుగా దిల్ రాజు తెలిపారు..

సంబంధిత సమాచారం :