అన్నీ కుదిరితే నాగ చైతన్య మూడు

Published on May 15, 2021 3:00 am IST

నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మంటే ముందు ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ పూర్తిచేశారు. అన్ని పనులు ముగించుకుని విడుదలకు రెడీ అవుతుండగా కరోనా కేసులు పెరగడం, థియేటర్లు మూతబడటంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. దీంతో చైతన్య విక్రమ్ కుమార్ సినిమాకు వెళ్లిపోయారు. అన్ని సినిమాలు ఆగిపోయినా ‘థాంక్యూ’ షూటింగ్ మాత్రం విదేశాల్లో జరిగింది.

ఈ రెండూ కాకుండా హిందీలో ఆమిర్ ఖాన్ చేస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో ఒక కీ రోల్ చేస్తున్నాడు చైతన్య. లాక్ డౌన్ ఆంక్షకు తొలగాక ఈ సినిమా చిత్రీకరణ మొదలైతే అందులో జాయిన్ అవుతాడు చైతూ. ఈ మూడు సినిమాలు కూడ ఈ ఏడాదిలోనే విడుదల కావాలి. షూటింగ్స్ అనుకున్నట్టే జరిగితే చైతూ నుండి ఈ ఏడాది మూడు సినిమాలను చూడొచ్చు. ఒకవేక ఆమిర్ ఖాన్ సినిమా ఆలస్యమైనా ‘లవ్ స్టోరీ, థాంక్యూ’ సినిమాలు మాత్రం పక్కాగా రిలీజవుతాయు.

సంబంధిత సమాచారం :