ఈ సంవత్సరం పుట్టిన రోజు మన ‘బాలయ్య’కు చాలా ప్రత్యేకమైనది

ఈ సంవత్సరం పుట్టిన రోజు మన ‘బాలయ్య’కు చాలా ప్రత్యేకమైనది

Published on Jun 10, 2018 12:02 PM IST


ఈ రోజు నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు అని అందరికీ తెలిసిన విషయమే. బాలయ్య తన 58వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే దర్శకుడు క్రిష్.. ‘ఎన్టీఆర్ బయోపిక్’ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ బాలయ్యకు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు సీనియర్ నటుడు నరేష్ కూడా బాలయ్యకు ట్వీటర్ ద్వారా పుట్టినరోజు శుభకాంక్షలు తెలుపుతూ.. ‘ఈ సంవత్సరం మన బాలయ్య బాబు జరుపుకుంటున్న పుట్టిన రోజు చాలా ప్రత్యేకమైనది. ఆయనకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిర్మించనున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చూడాలని ఆతృతగా ఉంది’’ అని ట్వీట్ చేస్తూ ‘ఎన్టీఆర్’ బయోపిక్ పోస్టర్ ను కూడా ఆయన ట్వీట్ తో పాటుగా జతచేశారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ కూడా ఒక ముఖ్య మైన పాత్రలో నటించనున్నారని సమాచారం.

బాలయ్య అభిమానులు మాత్రం ఈ ట్వీట్స్ ను షేర్ చేస్తూ తమ అభిమాన హీరోకి సంబంధిచిన పోస్టర్స్ ను, డైలాగ్స్ పోస్ట్ చేస్తూ ఆనందిస్తున్నారు. ఇప్పటికే బాలయ్యను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపటానికి భారీ సంఖ్యలో ఆయన అభిమానులు ఆయన నివాసానికి చేరుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు