రజినీ – లోకేష్ ప్రాజెక్ట్ లో ఈ యంగ్ స్టార్ హీరో?

రజినీ – లోకేష్ ప్రాజెక్ట్ లో ఈ యంగ్ స్టార్ హీరో?

Published on Nov 28, 2023 9:01 AM IST

తలైవర్ రజినీకాంత్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “జైలర్” తో తాను సెన్సేషనల్ కం బ్యాక్ ని అందుకోగా ఈ సినిమా అనంతరం తన లైనప్ పట్ల రానున్న సినిమాల పట్ల మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ లైనప్ లో అవైటెడ్ బిగ్గెస్ట్ కాంబో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేయనున్న తలైవర్ 171 పై ఉన్న హైప్ వేరు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ అయితే వినిపిస్తుంది.

దీనితో ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోస్ లో ఒకడైన శివకార్తికేయన్ నటిస్తున్నట్టుగా తమిళ్ సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి దీనితో క్యాస్టింగ్ పరంగా అప్పుడే ఈ సినిమా మరింత గ్రాండ్ గా వెళ్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమా షూట్ ప్రస్తుతం రజిని 170 కంప్లీట్ అయ్యాక స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు