ఓటిటీలోకి ఆ సినిమాలు.. నిజమేనా ?

ఓటిటీలోకి ఆ సినిమాలు.. నిజమేనా ?

Published on Aug 9, 2020 9:11 PM IST

క‌రోనా మ‌హ‌మ్మారితో సినీ ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. లాక్‌డౌన్ తో ఆపేసిన సినిమాల షూటింగ్స్ మళ్లీ మొదలైనా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఇంకా క్లారిటీ లేదు. దాంతో ఏ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో కూడా తెలియకుండా పోయింది. ఇప్పటికే నిశ్శబ్దం, రెడ్, మాస్టర్, ‘వి’, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన లాంటి సినిమాలు ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నాయి.

అయితే థియేటర్ల ఓపెనింగ్ పై ఇంకా క్లారిటీ లేదు, ఒకవేళ థియేటర్లు ఓపెన్ చేసినా జనం వస్తారని గ్యారంటీ లేదు. అందుకే చిన్న సినిమాలను ఓటిటీలో రిలీజ్ చేసుకోవడమే బెటర్ అని ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినా ఓటిటీ ప్లాట్ ఫామ్ లో డైరెక్ట్ రిలీజ్ కి మాత్రం ఆయా సినిమాల మేకర్స్ అంగీకరించట్లేదు. కానీ తాజాగా పై సినిమాల్లో కొన్నిటిని ఓటిటీలో డైరెక్ట్ రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

అలాగే స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రాబోతున్న నిశ్శబ్దంకు కూడా ఓటిటీ ప్లాట్ ఫాన్స్ లో మంచి డిమాండ్ ఉంది. మరి నిశ్శబ్దం టీమ్ ఏమి చేస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు