ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న ఆ రూమర్స్.

Published on Jan 19, 2020 4:01 pm IST

ఆర్ ఆర్ ఆర్ మూవీ పై వస్తున్నవరుస రూమర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తెగ బయపెట్టేస్తున్నాయి. ఎన్టీఆర్ ని వెండి తెరపై ఎప్పుడు చూస్తామా అని ఎదురుస్తున్న, వారు నిరాశకు గురి అవుతున్నారు. గత కొన్ని నెలలుగా ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ఏకంగా 2021కి పోస్ట్ పోన్ అయ్యిందని కథనాలు రావడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ వరుసగా అనేక మార్లు వాయిదా పడటంతో ఈ అనుమానాలు తలెత్తాయి. ఐతే నాన్ స్టాప్ గా వస్తున్న ఈ ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా వార్తలకు కొద్దిరోజుల క్రితం చిత్ర యూనిట్ 70 శాతం వరకు షూటింగ్ పూర్తి చేశాం అని చెప్పి, చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తాజాగా మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల జులై నుండి దసరాకు షిఫ్ట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కలవరపెడుతున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ స్క్రీన్ పై కనిపించి ఏడాది దాటిపోయింది. ఆయన నటించిన చివరి చిత్రం అరవింద సమేత వీర రాఘవ 2018 అక్టోబర్ లో విడుదలైంది. 2019 ఆయన నుండి సినిమా రాకుండా ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఆయనను తెరపై ఎప్పుడు చూస్తామని అని వారు ఎదురు చూస్తున్నారు. ఒక వేళ ప్రకటించిన విధంగా జులై 30న ఆర్ ఆర్ ఆర్ విడుదల కాకుంటే ఇంకొన్ని రోజులు వారు ఎదురు చూడాల్సివస్తుంది. అందుకే ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా రూమర్స్ వారిని ఇబ్బంది పెడుతున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More