గోపీచంద్ ‘భీమా’ లో హైలైట్స్ అవేనట ?

గోపీచంద్ ‘భీమా’ లో హైలైట్స్ అవేనట ?

Published on Feb 27, 2024 8:33 PM IST

యాక్షన్ నటుడు గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ భీమా. ఈ మూవీలో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించగా కెజిఎఫ్ సినిమాల దర్శకుడు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే భీమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ అన్ని కూడా ఆకట్టుకుని మూవీ పై బాగానే అంచనాలు ఏర్పరిచాయి.

విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీలో హైలైట్ అంశాలు ఇవేనంటూ ఒక న్యూస్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దాని ప్రకారం భీమాలో గోపీచంద్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండడంతో పాటు ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ సూపర్ గా వచ్చాయట. ఇక థ్రిల్లింగ్, యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ కి మంచి కిక్ ని అందిస్తాయని, తప్పకుండా హీరో గోపీచంద్ కు ఈ మూవీ మంచి బ్రేక్ ని అందిస్తుందని అంటున్నారు. కాగా భీమా మూవీ మార్చి 8న ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు