
గుణశేఖర్ తన తదుపరి చిత్రం రుద్రమదేవి 3డి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతుంది. 14 వ శతాబ్దం లో ఇండియా ను పాలించిన కొద్ది పాటి రాణులలో కాకతీయ రాజ్యాన్ని పాలించిన రాణి రుద్రమ దేవి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చారిత్రక నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి దాదాపు ఎటువంటి విషయాలను వదిలిపెట్ట కూడదని గుణశేఖర్ భావిస్తున్నారు.
ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న తోట తరణి, దాదాపు 400 స్కెచెస్ గీశారు. అందులో నుంచి కొన్ని స్కెచెస్ ను తీసుకొని 12 భారీ సెట్టింగ్ లను నిర్మించారు. ఈ సెట్స్ కోసం గుణశేఖర్ స్వయంగా దాదాపు రూ. 15 కోట్లను ఖర్చు పెట్టారని సమాచారం.అంతేకాకుండా ఈచిత్రం కోసం దాదాపు రూ.5 కోట్లు విలువ చేసే నగలను కూడా ఆయన ఇటీవల కొనుగోలు చేశారు. అనుష్క, రానా లు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ సంవత్సరం పూర్తి కావచ్చు. తరువాత ఈ చిత్రానికి ఎంత ఖర్చు పెట్టారన్న విషయం తెలుస్తుంది. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ 3డీ చిత్రానికి అజయ్ విన్సెట్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.