బాలయ్య 107 కోసం లిస్ట్ లో ముగ్గురు భామలు !

Published on Jun 13, 2021 11:04 pm IST

నట సింహం బాలయ్య తన పుట్టినరోజు సందర్భంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107వ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన దగ్గర నుండి ఈ సినిమా పై అనేక రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన స్టార్ హీరోయిన్ ను ఫిక్స్ చేయాలని గోపిచంద్ మలినేని, శృతి హాసన్ తో చర్చలు జరుపుతున్నాడని, ఆమె అంగీకరించిందని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా సీనియర్ హీరోయిన్ త్రిష పేరు కూడా వినిపిస్తోంది. పైగా త్రిష గతంలో బాలయ్యతో ఆల్ రెడీ ఒక సినిమా కూడా చేసింది. సో.. అవకాశం వస్తే ఎట్టిపరిస్థితుల్లో బాలయ్య సినిమా వస్తే వదులుకోదు. మరోపక్క నయనతారను హీరోయిన్ గా ఫైనల్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు మైత్రీ మూవీ మేకర్స్, కానీ గోపిచంద్ మలినేని మాత్రం శ్రుతీ హసన్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని, ఆమె ఫైనల్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత సమాచారం :