బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు !


నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం నిన్న గురువారం రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రారంభమైన సంగతి తెల్సిందే. ప్రముఖ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ నిన్నటి నుండే మొదలైంది. మాస్ అంశాలతో పాటు ఎమోషనల్ కంటెంట్ ఉన్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు.

వారిలో ప్రధమ కథానాయకి లేడీ సూపర్ స్టార్ నయనతార కాగా మరో ఇద్దరు ఎవరనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రకాష్ రాజ్, అశుతోష్ రానా, బ్రహ్మానందం వంటి నటీ నటులు నటిస్తునం ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం సమకూర్చనుండగా రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ చేయనున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని 2018 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. మరోవైపు బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’ సెప్టెంబర్ 1న విడుదలకానుంది.