ధనుష్ నెక్స్ట్ లో ముగ్గురు హీరోయిన్స్..?

Published on Jul 9, 2021 8:05 am IST

తమిళ ఇండస్ట్రీలో ఉన్న పలు విలక్షణ నటుల్లో స్టార్ హీరో ధనుష్ కూడా ఒకడు. ఎలాంటి రోల్ కి అయినా కూడా కరెక్ట్ గా సూటయ్యే ఈ టాలెంటెడ్ హీరో ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ లైనప్ తో రెడీగా ఉన్నాడు. అలాగే ఏకంగా హాలీవుడ్ సినిమా కూడా ధనుష్ చేస్తున్నాడు. అలాగే మన టాలీవుడ్ దర్శకులతో కూడా పాన్ ఇండియన్ సినిమాలు కమిట్ అయ్యి మరింత ఆసక్తి రేపాడు.

అయితే ధనుష్ లైనప్ లో చాలానే సినిమాలు ఉన్నాయి వాటిలో కోలీవుడ్ దర్శకుడు మిత్రన్ జవహర్ తో ప్లాన్ చేసిన తన 44 సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ తో నటించనున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ లేటెస్ట్ బజ్ ప్రకారం నిత్యా మీనన్, హన్సిక అలాగే ప్రియా భవాని శంకర్ లు ఈ చిత్రంలో ధనుష్ తో రొమాన్స్ చేయనున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :