యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామా చిత్రంగా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు ముగించుకుంది.
థగ్ లైఫ్ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 45 నిమిషాలకు లాక్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ రిలీజవగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.
ఈ సినిమాలో కమల్ హాసన్‌తో పాటు శింబు, త్రిష, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జూన్ 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.