పక్కా ప్లానింగ్‌తో రానున్న ‘థగ్ లైఫ్’.. ట్రైలర్ ఎప్పుడంటే?

పక్కా ప్లానింగ్‌తో రానున్న ‘థగ్ లైఫ్’.. ట్రైలర్ ఎప్పుడంటే?

Published on May 14, 2025 8:02 PM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘థగ్ లైఫ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఇప్పటికే ఈ చిత్రాన్ని అదిరిపోయే లెవెల్‌లో ప్రమోట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్‌కు సంబంధించి తమ ప్లానింగ్‌ను మేకర్స్ వెల్లడించారు. ఇందులో భాగంగా థగ్ లైఫ్ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్‌తో పాటు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్‌ను కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

థగ్ లైఫ్ చిత్ర ట్రైలర్‌ను మే 17న రిలీజ్ చేయనున్నారని.. ఆడియో లాంచ్ ఈవెంట్‌ను మే 24న.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను పలు తేదీల్లో పలు నగరాల్లో ప్లాన్ చేశారు మేకర్స్. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను జూన్ 5న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు