థగ్స్ అఫ్ హిందుస్థాన్ ట్రైలర్ ఆరోజే విడుదలకానుంది !

థగ్స్ అఫ్ హిందుస్థాన్ ట్రైలర్ ఆరోజే విడుదలకానుంది !

Published on Sep 14, 2018 12:01 AM IST

Aamir Khan Amitabh Bachchan
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’. విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్ , కత్రినా కైఫ్ , ఫాతిమా సన షేక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

యాష్ రాజ్ ఫిలిమ్స్ పతాకం ఫై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం యొక్క ట్రైలర్ ను యాష్ చోప్రా జయంతి సందర్బంగా సెప్టెంబర్ 27న విడుదలచేసే అవకాశం వుంది.

సముద్రం , పడవల నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈచిత్రం నవంబర్ 7న ప్రేక్షకులముందుకు రానుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఈసినిమాకు కీలకం కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు