యూఎస్ లో “టిల్లు స్క్వేర్” సెన్సేషన్!

యూఎస్ లో “టిల్లు స్క్వేర్” సెన్సేషన్!

Published on Mar 29, 2024 10:00 AM IST

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం లో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ (Tillu square) మూవీ నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్ల గ్రాండ్ రిలీజ్ అయ్యింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించిన ఈ చిత్రం లో బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం యూఎస్ ప్రాంతం లో సూపర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.

ఇప్పటి వరకూ యూఎస్ ప్రాంతంలో ప్రీమియర్ షోలతో 450కే డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ సినిమా వన్ మిలియన్ మార్క్ ఈజీగా చేరుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి లు సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు