‘నాగబంధం’ ట్రైలర్ కి టైమ్, రన్ టైమ్ ఫిక్స్..!

‘నాగబంధం’ ట్రైలర్ కి టైమ్, రన్ టైమ్ ఫిక్స్..!

Published on Jun 19, 2026 1:30 PM IST

భారీ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం’ అఫీషియల్ ట్రైలర్ నేడు సాయంత్రం 5:04 గంటలకు విడుదల కానుంది. కళ్లు చెదిరే విజువల్స్, అద్భుతమైన గ్రాండియర్‌తో 3 నిమిషాల 19 సెకన్ల పాటు సాగే ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఒక సరికొత్త ఊహాజనిత ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది.

​విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, పురాతన విష్ణు దేవాలయాల రహస్యాల నేపథ్యంలో సాగే ఒక భారీ ట్రెజర్ హంట్‌గా రూపొందింది. హైదరాబాద్ ప్రసాద్స్ పిసిఎక్స్ స్క్రీన్‌పై ఈ ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నారు.

​అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో జులై 3వ తేదీన గ్రాండ్‌గా విడుదల కానుంది.

తాజా వార్తలు