మంచు మనోజ్ నుంచి ఈ ఏడాది పలు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే మిరాయ్ సినిమాలో మొదటిసారి విలన్ గా కూడా చేసి మెప్పించి అదరగొట్టాడు. కానీ తన నుంచి హీరోగా సాలిడ్ ట్రీట్ కోసం తన ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఫైనల్ గా మాస్ ట్రీట్ కి మేకర్స్ వేదికని ఇంకా అందులో సమయాన్ని ఖరారు చేశారు. దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై సాలిడ్ హైప్ అయితే ఉంది.
మరి దీని నుంచి ఓ మాస్ పోస్టర్ ని వదిలి ‘డేవిడ్ రెడ్డి’ మేకర్స్ ఫ్యాన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తాలూకా గ్లింప్స్ ని రేపు డిసెంబర్ 17న సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ ట్రిపుల్ ఏ సినిమాస్ లో లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ ట్రీట్ కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. మరి అదేంటి అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి వెల్వెట్ సౌల్ అలాగే ట్రూ రెడిక్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


