తారక్ మోస్ట్ అవైటెడ్ సినిమా అప్డేట్ కు టైం ఫిక్స్.!

Published on Apr 12, 2021 11:00 am IST

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎందుకు ఎదురు చూస్తున్నారో తెలిసిందే. ఇప్పుడు చేస్తున్న “RRR” కాకుండా అసలు నెక్స్ట్ ఉండేది ఏ దర్శకునితో ఏ సినిమా అన్నదే హాట్ హాట్ గా మారిన అంశంగా మారింది. ఇక ఇదిలా ఉండగా ఈ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఈరోజు రివీల్ అవుతుంది అని నిన్న సమాచారం బయటకు రాగా..

ఇప్పుడు ఆ అప్డేట్ ఏ సమయానికి వస్తుందో అన్నది కన్ఫర్మ్ అయ్యింది. ఈ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఈరోజు సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు రానున్నట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. మరి ఈ చిత్రం దర్శకుడు ఎవరు అన్నదాని కోసమే అంతా ఎదురు చూస్తున్నారు.తారక్ తో రేస్ లో త్రివిక్రమ్, కొరటాల శివ సహా లేటెస్ట్ దర్శకుడు బిచ్చిబాబు పేరు కూడా వచ్చింది. మరి వీరిలో ఎవరు ఫిక్స్ అన్నది తెలియాలి అంటే ఈరోజు సాయంత్రం వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :